5th Part Vijayasvapnam

PUBLIC BETA

Note: You can change font size, font face, and turn on dark mode by clicking the "A" icon tab in the Story Info Box.

You can temporarily switch back to a Classic Literotica® experience during our ongoing public Beta testing. Please consider leaving feedback on issues you experience or suggest improvements.

Click here

స్వప్న తలారా స్నానం చేసి, పొద్దున్న తయారు చేసి ఉంచుకున్న ఆరు మూరెల మల్లపూలు జడ మునిగిపోయేలా తురుముకుని, చేతినిండా ఎర్రని మట్టిగాజులూ,. అటూ ఇటూ బంగారు గాజులూ వేసుకుంది,. మేడమిచ్చిన నెక్లెస్ ధరించి, చెవులకు జూకాలు వేసుకుని, ముస్తాబై, తెల్లని పాల నురుగు వంటి చీరె, జాకెట్ లో, అపర రతీదేవిలా తయారైంది. వాల్ క్లాక్ పది చూపిస్తూంటే, స్టవ్ మీద పాలు పెట్టింది.

“మేడంని ఆకర్షించడానికి తనో బ్రోతల్ లా ప్రవర్తిస్తూ ఉందేమో?”, ఒక్క సారిగా అనిపించి, చివ్వున కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. మనసంతా బాధగా అనిపించింది. కళ్ళు ఒత్తుకుంది. గొంతు పూడుకుపోయినట్లై మంచినీళ్ళు తాగింది. మనసును సమాధాన పరుస్తూ, తన తల్లి తండ్రుల ఫొటోకి దణ్ణం పెట్టుకుని, “నాన్నా ! మంచో చెడో, నాకిలా రాసిపెట్టి ఉంది. నాకు మరో బెటర్ చాయిస్ ప్రస్తుతానికైతే కనబడడం లేదు. మేడం ని ఇంప్రెస్ చేస్తేనే నాకు మంచి ఫ్యూచర్. ఆవిడను సంతృప్తి పరిస్తే, నాకో మంచి జీవితం తర్వాతైనా చూపిస్తుందని ఆశ.. నేను ఇంత వరకూ ఏతప్పూ చేయలేదు. ఒకవేళ ఇది తప్పైతే నన్ను క్షమించండి. నా అనాధజీవితం ఒక దరి చేరేవరకూ ఇది నేనాడక తప్పని ఒక నాటకమనుకుని నన్ను దీవించండి నాన్నా. బయట ఒంటరిగా బ్రతుకుతూ, ఎవరో మృగాళ్ళ చేతిలో బలైపోయే బదులు ఇది నయమే కదా. కొంత కాలం తరవాతైనా నాకు నార్మల్ లైఫ్ అనుగ్రహించండి” అనుకుంటూ గుండె దిటవు చేసుకుంది.

ఈ సమయంలో ఇలా డీలా పడిపోవడం ఇద్దరికీ మంచిది కాదనుకుంది. తప్పనప్పుడు, ఇలాంటి అవకాశాన్ని ఎంజాయ్ చెయ్యడమే బెటరనుకుంది. తను ఈవారం రోజులూ చదివిన సెక్సు పుస్తకాలూ, చూసిన అడల్టు సినిమాలూ ప్రయత్నం మీద గుర్తుకి రప్పించుకుని, తన మనసులో శృంగార ఆలోచనలు మళ్ళీ నింపుకుంది. జిమ్ లో డైరెక్టు గానూ, పడుకున్నప్పుడు చాటుగానూ చూసిన మేడం అర్ధ నగ్నభంగిమలు గుర్తుచేసుకుంది. పొద్దున్న బైక్ పైకి మేడం ఎక్కిన ఫోజూ, ఆమె కిక్ కొట్టిన జోరూ మనసులో కదలాడాయి. మరో ప్రక్క తన శీలానికి డోకా లేదన్న విషయం స్ఫురణ కి వచ్చింది. అంతే, మరలా ఎక్కడలేని ఉత్సాహమూ ముంచుకు వచ్చింది. ఒక క్షణంలో దిగులు ... మరు క్షణం లో కోరిక ... ఈవిధంగా మస్తిష్కం చేసే మాయను చూసి నవ్వుకొంది. ఒక ప్రక్క తన వయసుపోరు తొలి పొందు కోసం తొందర పెడుతూంటే, పాలు పూర్తిగా వేడెక్కేంత వరకూ కూడా ఆగలేకపోయింది. వెచ్చనిపాలు వెండి గ్లాసులోకి వంపుకొని, మేడం గది వైపు వడి వడిగా నడిచింది, కోటి కోరికలతో స్వప్న.

***

స్వప్న మేడం గది దగ్గర ఆగి అలవాటు ప్రకారం తలుపు తట్టి, ఒక్క క్షణం ఆగింది. గుండె గుబ గుబ లాడుతోంది. రోజూ సర్దేందుకు వచ్చే గదే అయినా ఈరోజుమాత్రం క్రొత్తగా , గాభరాగా ఉంది.

‘రా... స్వప్నా!’ అన్న తనకు చిర పరిచితమైన పిలుపు వినగానే గుండె దడదడ లాడుతుండగా తలుపు మెల్లగా తెరచి లోనికి అడుగు పెట్టింది. మేడం ఫస్ట్ నైట్ కోసం మంచం సర్దుతోంది.

జీన్స్ నిక్కరు వేసుకుని , తెల్లని స్లీవ్ లెస్ లోనెక్ టీ షర్ట్ టక్ చేసింది మేడం. లోపల బ్రా లేదు. టైటుగా ఉన్న పొట్టి బిగువైన నిక్కరు క్రింద తెల్లని తొడలు అరటి బోదెల్లా ఉబికి ఉబికి తెల్లగా నిగనిగ లాడుతున్నాయి. మొగాడిలా, మొగుడిలా తయారైనా, మేడం ఎత్తైన గుండెలూ, బాడీ షేపులు, ఆమె లోని ప్రౌడ ఆడతనాన్ని ఏమాత్రం దాచలేకపోతున్నాయి సరి కదా మేడం లోని స్త్రీత్వం పొగరుమోతు అరేబియా గుర్రంలా మరింత సెగలు కక్కుతోంది. స్లీవ్ లెస్ చంకల నుండి చొచ్చుకొస్తున్న కండలు తేరిన బాహువులను చూస్తే స్వప్న నోటిలో తడారిపోతోంది. మొత్తం మీద మేడం ఫిగరు సిక్స్ పాక్ బాడీలా మరింత సెక్సీగా, కసిగా కనిపిస్తోంది. ఈసారి మేడంని చూడడానికి స్వప్నకి అంత మొహమాటం అనిపించలేదు. అసలే మాంచి ధృడమైన శరీరమేమో టైటునిక్కరులో విజయ మీసం లేని మగరాయుడిలా మాంచి రంజుగా ఉంది. పైగా ఆ నిక్కరు ముందు భాగం ఉబ్బెత్తుగా ఉంది మగాడిలా. లోనెక్ టీ షర్ట్ క్లీవేజ్ లోనుండి కనిపిస్తున్నమేడం గుండెల మధ్య స్వప్న చూపులు లయ తప్పి ఇక అక్కడ నుండి కదలలేక పోతున్నాయి.

“అబ్బ! ఇంత ఆకర్షణీయమైన బలమైన మేడం బాడీ క్రింద నలిగి పోని బతుకు ఎందుకు ?“ అనిపించి స్వప్నలోని కన్నెమనసు మెల్లగా ఒళ్ళు విరుచుకోసాగింది. మొన్నటిలా మేడంని ప్రతిఘటించి అనవసరంగా రేప్ చేయించుకోవడమెందుకు, హాయిగా సహకరించి మేడంని సుఖపెట్టి , తనూ సుఖపడాలి, ఫస్ట్ నైట్ లా.

పానుపు సర్దడం అప్పుడే ముగించిన విజయ స్వప్న కేసి తేరిపార చూసింది. పాల గ్లాసు పట్టుకుని దాదాపు పెళ్ళి కూతురు ముస్తాబులో ఉన్న స్వప్నకేసి ఆరాధనగా కళ్ళార్పకుండా చూస్తూ దగ్గరగా వచ్చింది విజయ. దేవ కన్యలా ఉన్న స్వప్నను చూసేసరికి విజయకు నోట మాట రాలేదు. ఆమె వంక అలాగే చూస్తుండిపోయింది..

పానుపు కేసి కలయ చూస్తున్న అమాయకమైన, కొంచెం భీతితో కూడిన పెద్దపెద్ద బాతుగుడ్ల కళ్ళు. సన్నని ముక్కు. నున్నని బుగ్గలు. ఎర్రని చిన్ని చిన్ని పెదాలు. తెల్లని మొహం. స్వప్నకు సహజంగా అబ్బిన ప్ర్రవీణ్యంతో టైటుగా కట్టిన చీరెకట్టులో ఎత్తుగా ఊరిస్తున్న వక్ష స్థలం. బొడ్డు కనబడకుండకుండా చీరె కట్టినా సరే, సన్నని నడుం క్రింద తియ్యని పనసపళ్ళలా ఉన్న పిరుదులు. ఊరిస్తున్న ఈ మొత్తం అందం పూర్తిగా తనది. భుజం మీద చేయి వేసి కొద్దిగా దగ్గరకు లాక్కుంది. బిరుసెక్కిన మేడం స్థనాలు స్వప్న పాలిండ్లకు గుచ్చుకున్నాయి. మరో చేయి స్వప్న నడుం చుట్టూ వేసి చీరకు జాకెట్ కీ మధ్య ఉన్న సన్నని నడుము మడతని నొక్కింది. ఒక్క సారిగా ఒళ్ళు ఝల్లుమని కళ్ళు అరమోడ్పులయ్యాయి స్వప్నకు. అదే చేతితో స్వప్నను దగ్గరకు లాక్కుంటుంటే విజయ ఒంటి వేడి స్వప్నకు తెలుస్తోంది.

నోరు తెరుచుకుని తనవైపే విసురుతున్న చూస్తున్న తూపుల్లాంటి విజయ చూపులు స్వప్నలో బిడియాన్ని మరింత పెంచాయి. సిగ్గుతో మరింత పెరిగిన కొత్త పెళ్ళి కూతురి అందాలను మురిపెంగా చూస్తూ స్వప్నను తన కౌగిలిలో బంధించింది విజయ. స్వప్నచుబుకం పై ఉన్న సన్నని చీలికపై తన చూపుడు వేలిని పెట్టి పైకి లేపింది విజయ. ఇద్దరి చూపులూ పెనవేసుకున్నాయి. అసలే పెద్దవైన కళ్ళూ మరింత పెద్దవై విజయ మనసును మరింత పాడు చేసాయి. స్వప్నను దగ్గరగా తీసుకుని తన గుండెల కేసి హత్తుకుంది. స్వప్న చిట్టి గువ్వలా మొదటిసారిగా తనంత తానుగా విజయ కౌగిలిలోఒదిగిపోయింది.

స్వప్న చేతిలోని పాల గ్లాసుని విజయ తీసుకుని, తను కాస్త తాగి, స్వప్నను ఆప్యాయంగా ఒక చేత్తో పొదివి పట్టుకుని మరో చేతితో పాల గ్లాసు పట్టుకుని స్వప్నతో మెల్లగా తాగించసాగింది. స్వప్న రెండు గుటకలు వేసిందో లేదో, విజయ తన చేతిలోని గ్లాసును టక్కున ప్రక్కన టేబిల్ మీద పెట్టి అదే చేతితో స్వప్న బుగ్గలను వేళ్ళతో నొక్కి స్వప్న మూతిని సున్నాలా చేసి పాల చారికలతో ఎర్రగా మెరుస్తున్న స్వప్న నోటిపై తన నోటిని బలంగా తాపడం చేసి స్వప్న నోటిలో ఇంకా మింగకుండా మిగిలిన పాలను బలంగా చప్పుడు చేస్తూ జుర్రుకుంది. ప్రక్కకు కారుతున్న పాల చుక్కలను చాకచక్యంగా నాలికతో లోపలికి లాక్కుంది. స్వప్న తనింటికి మొదటిసారి వచ్చినప్పుడు తనిచ్చిన కూల్ డ్రింక్ తాగినప్పుడు కారిన అప్పటి ఆ చుక్క ను తను అందుకోవాలన్న ఆనాటి కోరిక ఈనాడు తీరింది. స్వప్నఎంగిలి అమృతం.... కాదు.. కాదు ఖరీదైన విదేశీ స్కాచ్. ఇంకా తనివి తీరని విజయ స్వప్న రెండు బుగ్గలనూ తన అరిచేతులమధ్య బంధించి చురకత్తిలా తన నాలుకని స్వప్న నోటిలోనికి కస కసా దించుతూ నాలుకతో రతి చేస్తున్నట్లుగా స్వప్న ఎంగిలిని మరింతగా ఆస్వాదించింది. స్వప్న కూడా ఈసారి ప్రతిఘటించకుండా మేడం నడుం చుట్టూ తన లేత చేతులువేసి విజయ నోటికి తన నాలుకని చుట్టిన తమలపాకు చిలకలా అందించింది. విజయ ఆ నాలుకను తన నోటిలోనికి లాక్కుని కోరిక తీరా ఆస్వాదించింది. అలా కొద్ది నిమిషాలు స్వప్న నోటి జ్యూస్ ని తనివి తీరా చెఱుకురసంలా ఆస్వాదించింది విజయ.

ఈసారి విజయ తన పుక్కిలినిండా పాలు తీసుకుని స్వప్ననోటిలో తన నోటిని పెట్టి లోనికి సన్నగా కొంచెం కొంచెంగా పంపింది. ఈసారి స్వప్న కూడా ఆ ఎంగిలి పాలను చనుబాలు తాగుతున్న పసి పిల్లలా పీలుస్తూ అమృతంలా ఆస్వాదించింది. చివరిగా విజయ నాలుకను కూడా ఎంతో ఇష్టంగా తన నోటిలోనికి ఆహ్వానించి ఆస్వాదించింది.

అలా ఒకరికొకరు పాలను అధరామృతాలతో కలిపి తాగించుకున్నాక గ్లాసుడు పాలూ అప్పుడే ఐపోయాయా అని ఇద్దరికీ అనిపించింది. విజయకైతే, ఒక ఫుల్ బాటిల్ కొట్టినా రానంత కిక్ వచ్చేసింది.

తనతో పోలిస్తే పిట్టంత లేదు. కసెక్కించి చంపేస్తూంది. క్షణంలో గుడ్డలూడదీసి మొన్నటిలా మంచంపై కుదేసి, మీద పడి తన నిక్కరులో బిగించి కట్టిన రబ్బరు దడ్డును జిప్పు తీసి బయటికి లాగి, కసక్కున స్వప్నలోనికి దించేసి కసి కసిగా దెంగేసి తన వేడిని చల్లార్చుకుందామా అన్నంత ఆవేశం కలిగినా, తమాయించుకుంది.

“ఊహు” ఈ అమ్మాయిని మొన్నటిలా హడావిడిగా అనుభవించకూడదు. మెత్తగా…., పూర్తిగా.....సావకాశంగా... రతిలో పూర్తి అనుభవమున్న విటుడు తను మోజుపడ్డ ఉంపుడు గత్తెను అనుభవించినట్లుగా...తెల్లవార్లూ ...ఇది ఒక రాత్రితో తీరిపోయే మోజు కాదు. ప్రతీ రోజూ అనుభవించాల్సిన విందు భోజనం.

ఈసారి ప్రక్కన పళ్ళెంలో పెట్టిన ఒక పొడవైన జ్యూసీ గులాబ్ జాం ను తీసి స్వప్న నోటిలో సగానికి పెట్టి, స్వప్న మూతిపై తన మూతిని పెట్టి మరోసగాన్ని తను కొరుక్కు తింది. మిగతా సగం స్వప్న తింటుండగా జ్యూస్ తో మిలమిలా మెరుస్తున్న స్వప్న ఎర్రని పెదాలను విజయ తన నాలికతో మరీ మరీ క్లీన్ చేసింది. అలా పళ్ళెంలో ఉన్న అర డజను గులాబ్ జాముల్నీ ఒకరి నోటితో ప్రేమగా మరొకరు తినిపించుకున్నారు. మామూలు క్రొత్త దంపతులైనా సరే అలా ఎంజాయ్ చెయ్యరేమోననిపించింది స్వప్నకు.

స్వప్న మేకప్ ని ఏమాత్రం చెదరనీయకుండా, అలాగే తన గుండెలకేసి హత్తుకుంది.. తన మెడ వరకూ ఎత్తు ఉన్న ఆ అందాల భరిణను, తన గాడ పరిష్వంగంలో బంధించింది. ఒక చేతితో పూలతో నిండిన స్వప్న తలనూ, మరొక చేతితో స్వప్న పిరుదులనూ తనకేసి అదుముకుంది. తను తొడుక్కున్ననిక్కరు క్రింద నగ్నంగా ఉన్న కాళ్ళకు స్వప్న కుచ్చిళ్ళు నిలువెల్లా మెత్తగా పాల నురగలా తగులుతూ తనలోని కోరికను పెంచుతున్నాయి.

విజయ నిక్కరు మధ్య ఉబ్బెత్తు ప్రదేశం స్వప్న మానానికి కొంచెం పైన పొత్తి కడుపుపై చీరె పైనుంచే గుచ్చుకోసాగింది. ఆ నిక్కరు కింద ఉన్నది రబ్బరు పురుషాంగం అని అర్ధమై స్వప్నకు ఒళ్ళు తియ్యగా జివ్వుమంది. తను ఆల్రెడీ ఈ కొద్ది రోజులలో చాటుగా చూసిన వీడియోలలో ఈ స్ట్రాపాన్ డిల్డో లనబడే వీటిని చూసే ఉంది. మేడం చెప్పినట్లు ఈ రాత్రి తనకు నిజంగానే తీయని తొలిరేయన్నమాట. అంటే తన కన్యాత్వం చెదరబోతోంది.. అదీ ఒక ఆడదానిచేతిలో. మానభంగం మాత్రంకాదు కాబట్టి కడుపొస్తుందన్న ఆందోళనే లేని తొలిరాత్రి.. ఆ ఊహ ఎంతో మధురంగానూ, భరోసాగానూ ఉంది. అసలు అమ్మాయిలందరూ పెళ్ళి కాకముందు లెస్బియనిజం ఫాలో అయితే ఎంచక్కా అబ్బాయిల వలలో పడడాలూ తరువాత కాలు జారడాలూ ఉండవేమోనన్న ఆలోచన వచ్చి తనలో తాను నవ్వుకుంది. తొడల మధ్య తియ్యని సలపరం మొదలైంది. మొన్నంటే ఏదో తాను భయపడి మేడంతో బలాత్కారానికి గురయింది. ఈసారి అలా కాదు, మేడంని ఒక భర్తలా భావించి, తనను తాను మనస్పూర్తిగా సమర్పించుకుని మేడంని తృప్తి పరచి తానూ ఆనందించాలి. తన కోరికా తీరుతుంది, తన జీవితానికి ఒక అండా వస్తుంది. అయినా మేడం తనకిచ్చిన, ఇవ్వబోతున్న సహాయాలకి, బదులు ఇవ్వడానికి తన దగ్గర ఏముందని, మేడం మరులుగొన్న తన అందమైన శరీరం తప్ప. పోనీ సహకరిద్దాం. ఈ నాలుగు గోడల మధ్యేగా . మూడో కంటికి తెలియదు. మేడం ఆడదేగా. అదే మగాడైతే సవాలక్ష నీతుల గురించి ఆలోచించాల్సివచ్చేది. పైగా ప్రమాదం కూడానూ. పైగా ఇప్పుడైతే తన వయసుపోరు కూడా ‘ఆ’ అనుభవం కోరుకుంటోంది. ఇక స్వప్న లోలోపల ఉన్న ఆ ఒక్క గిల్టీ కాన్షస్ పోయింది. తనొక అనాఘ్రాణిత పుష్పం. భగవంతుడే, తన శీలం చెడకుండా మరో ఆడ తుమ్మెదను జత పరచాడు.

విజయ చేతులు స్వప్న నడుం చుట్టూ బిగుసుకోసాగాయి. తను ఎంతగా తపించింది ఈ క్షణం కోసం ? ఈ అమ్మాయి పొందు కోసం. ఈ లేత పెదాలతో, ఈ అమ్మాయి అంగీకారంతో, ఈ చిన్ని నోటి నుండి అమృతాన్నితాగాలనీ, ఈ లేత ఒంటిని ఇలా నలిపెయ్యాలనీ. తనివి తీరా అనుభవించాలనీ. ఇంకా.... ఇది కల కాదు కదా. స్వప్న నిజంగానే తనతో , ఇలా తనంత తానుగా తన కోరిక తీర్చబోతోందా?

విజయ వదిలే గాలి వేడిగా బరువుగా ఉంది. విజయ ఎత్తైన వక్షోజాలు స్వప్నపాలిండ్లను అదుముతున్నాయి. విజయ చంకలలోనుండి వస్తున్నమంచి ఫారిన్ సెంటు వాసన గమ్మత్తుగా చాలా ప్రొవొకేటింగ్ గా ఉంది.. (అది నిజానికి ఆడాళ్ళు వాడేది కాదు. మగాళ్ళు శృంగారానికి ముందు ఆడాళ్ళను ఆకర్షించడానికి వాడే మేల్ డియోడెరెంట్. అది స్మెల్ చేసిన ఏ ఆడదైనా సరే ఆ మగాడంటే పడి చస్తారు. అదే స్ప్రే విజయ ఇప్పుడు స్వప్నను లైన్లో పెట్టడానికి వాడింది. ఐడియా క్లిక్ అయ్యింది.)

“ స్వప్నా, ఐ లైక్ యూ సో మచ్, ఐవాంట్ యూ ఫరెవెర్, ప్రతీ రోజూ...ప్రతీ రాత్రీ.. పగలైనా సరే నాకు కోరిక కలిగినప్పుడల్లా... ఇలాగే, నన్నుచేరాలి. నన్ను సుఖ పెట్టాలి. ప్రపంచానికి నువ్వు నా కూతురులాంటి దానివి. ఇంట్లో మాత్రం నేను ఉంచుకున్నదానివి. నీకు వేరే పని ఏమీ ఉండదు. నన్ను సుఖపెట్టడమే నీ డ్యూటీ. సరేనా ” అంటూ స్వప్నను మరింతగా అదుముకోసాగింది.

చెవిలో గుసగుసగా ..“ నిన్ను అనుభవించి చాలా రోజులు అయ్యింది. ఆనాడు నీకు జరిగింది పైపై ట్రిబ్బింగ్. అంటే పైపై రుద్దుడు మాత్రమే. నీలో నేను ప్రవేశించడం మాత్రం కాలేదు. పాపం బలాత్కారం కూడానూ. ఈరోజు అలా కాదు. నీకు అసలైన తొలి రాత్రి.. అంటే తెలుసుగా. శోభనమే. నన్ను సుఖపెట్టి నువ్వూ సుఖపడు. మామంచి పాపవు కదూ. మొన్నటిలా మారాంచేసి నన్ను హైరానా పెట్టి నువ్వు ఇబ్బంది పడకు. సరేనా? ఈ రోజు నుండి నేనే నీకు మొగుణ్ణి. నన్ను ఈరోజు నుండి నన్ను మేడం లా చూడకు. నన్ను ఏమండీ అను. మేడం అని నన్ను దూరం చెయ్యకు. నీవరకూ నేను మగాణ్ణే. నీ కన్నె చెర తప్పిస్తాను. కడుపు చేయడం తప్ప అన్నీ చేస్తాను. అంటే తెలుసుగా? ముహూర్తం కూడా చూసానులే. బోణీకి మంచిరోజే. ?”

స్వప్న సిగ్గుగా సన్నగా నవ్వి కనులు మూసుకుంది. గ్రీన్ సిగ్నల్ దొరికిన విజయ స్వప్న భుజం మీద చెయ్యి వేసి పైట ప్రక్కకి తప్పించింది. స్వప్న ఈసారి పిన్ను పెట్టలేదు . పైట కుబుసంలా సర్రున జారిపోయింది. స్వప్నలోనూ కోరికలు చెలరేగుతున్నట్లు గుర్తుగా ఆమె జాకెట్ బిగుతుగా మారి పాల పొంగులు ఉబికి వస్తున్నాయి.. గుండ్రంగా, నిండుగా, పుష్టిగా ముందుకు తోసుకు వస్తున్నాయి. జాకెట్ చిరిగిపోతుందేమోనన్నట్లుగా ఉన్న ఆ ఉన్నతమైన సంపదను చేజిక్కించుకుంది విజయ. జాకెట్ పైనుండే మర్ధించడం ప్రారంభించింది. పైట తొలగిన స్వప్నను ఒక చేత్తో చుట్టేసి, మరో చేత్తో స్వప్న పాలిండ్లను జాకెట్ పైనుండే కసిగా వత్తడం మొదలెట్టింది విజయ. స్వప్న కూడా తమకంగా తన ఒంట్లో ప్రతీ అణువూ, విజయ విజయనగ్న దేహానికి హత్తుకునేలా ఒత్తుకుంటూ కోరికల వేడిలో, పెనవేసుకోసాగింది. వణుకుతున్నస్వప్న నోటిని విజయ తన నోటితో మూసేసింది. స్వప్న లేత పెదవులు విజయ మొరటు పెదాలక్రింద నలిగాయి. స్వప్న పెదాలను సుతారంగా కొరుకుతూ తమకం పెరగగా, ఒకేసారి ఆ పెదాలను తన నోట్లోకి పూర్తిగా లాక్కుని, తన బండ నాలుకని ఆ చిన్ని నోట్లోనికి తోసేసి గాడం గా ముద్దు పెట్టుకోసాగింది. స్వప్న తలలోని పూలు మత్తెక్కిస్తున్నాయి. ఒక ప్రక్కసళ్ళు పిసకడం మానలేదు. స్వప్న కూడా విజయ ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. కొంచెం సేపటికి విజయ స్వప్న పెదాలను కొద్ది క్షణాలపాటు వదిలింది. విజయ కళ్ళలోని ఎర్ర జీర ఆమెలోని కోరికల తీవ్రతను తెలియజేస్తున్నాయి. స్వప్న విజయ కళ్ళ లోకి ఎక్కువ సేపు చూడలేక సిగ్గుతో కళ్ళు దించుకుంది..

విజయ తన ఉక్కుబాహువుల మధ్య స్వప్న ను మరోసారి బంధించింది. స్వప్న ఆ బిగికౌగిలిలో ఉక్కిరి బిక్కిరయ్యింది. స్వప్న నోటిని అనుభవిస్తూనే, ఇక చేత్తో స్వప్న పిరుదులను తన నిక్కరు ఎత్తుకేసి అదుముతూనే, మరో చేతిని స్వప్న కుచ్చెళ్ళపైకి జార్చి నెమ్మదిగా దారి వెతుక్కుని రెప్పపాటు కాలంలో కుచ్చిళ్ళ ప్రక్కనుండి పొత్తికడుపు కిందకు చేతిని బలంగా తోసింది. తొడలమధ్యకు చేరుకుంది చేయి. స్వప్న మదన మందిరాన్నిదొరకపుచ్చుకుని, తడమసాగింది . స్వప్నఅడ్డుచెప్పలేదు. స్వప్న తొడల మధ్య మొదటి సారిగా చెమ్మ ఊరసాగింది.

స్వప్న రవిక మీదుగానే పాలిండ్లపై విజయ ముద్దులవర్షం కురిపించసాగింది. ఒళ్ళంతా జివ్వుమంది స్వప్నకు. కోరికతో బరువెక్కిన రొమ్ములలో రేగుతున్న తీపి సలపరం, దానికి తోడు మేడం చర్యలు స్వప్నను వేడెక్కిస్తున్నాయి. విజయకు ఏమాత్రం అడ్డూ చెప్పలేకపోతోంది. విజయ ఎత్తైన ఛాతీకి ఆ జాకెట్ క్రిందనున్న అమృత భాండాల వేడి, బిగి స్పష్టంగా తెలుస్తున్నాయి. బిగుతెక్కిన జాకెట్ ని తోసుకుంటూ ముచ్చికలు నిక్కబొడుచుకుంటున్నాయి. విజయ ఆ పయ్యెదపై ఒక రొమ్ముపై మొహాన్ని ఒత్తుకుంటూ, మరో రొమ్మును జాకెట్ పైనుంచే ఒక చేతిని బలవంతంగా లోపలికి పోనిచ్చి, పిసకసాగింది. స్వప్న మానం విజయ మరో చేతిలో బిగిసిన స్పాంజిలా అణుగుతోంది. మెల్లగా విజయ లో కామోద్రేకం పెరిగి ఊపిరి సన్నని బుసలుగా మారసాగింది. విజయ కళ్ళల్లోని కామం, ఊపిరిలోని వేగం, తన మర్మాంగాలపై విజయచేతులు చేస్తున్న అల్లరీ కలగలిసి స్వప్నలో జిలను రేపసాగింది. ఇక విజయను ఆపడం తనకూ సాధ్యం కాదనీ, తను కూడా ఇంకెంతో సేపు తట్టుకోలేనని స్వప్నకు అర్థం అయ్యింది. ఇద్దరిదీ ఒకే ధ్యేయం. సుఖాన్ని జుర్రుకోవాలన్నతీవ్రకాంక్ష ఇద్దరి మనసుల్నీ ముంచెత్తింది..

స్వప్న ఒళ్ళు జ్వరం వచ్చినట్లు కాలిపోతోంటే విజయ వేడి ముద్దుల తడితో మెరుస్తున్న స్వప్న పెదాలు తీవ్రంగా వణుకుతున్నాయి. ఆ వణుకును అపడానికి స్వప్న తన క్రింది పెదవిని పైపంటితో నొక్కిపెట్టిఉంచింది. ఆ భంగిమలో శృంగార రసాధిదేవతలా కనిపిస్తున్న స్వప్నను విజయ మరింతగా ముద్దులతో ఉప్పెనలా ముంచెత్తుతూ ఊపిరి సలపనంతగా ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

అదే ఊపులో స్వప్న చీర కుచ్చిళ్ళను విజయ ఒక్క గుంజు గుంజింది. అక్కడకూడా పిన్నుపెట్టలేదేమో. కుచ్చిళ్ళు బయటకు వచ్చి చీర కట్టు ఒకసారిగా లూజ్ అయ్యింది. క్షణంలో చీరను స్వప్న నుండి వేరుచేసి పడేసింది.

అంతే, క్షణంలో స్వప్న విజయకెంతో ఇష్టమైన భంగిమ, అదే, టైట్ లంగా జాకెట్ లో మిగిలింది. అది విజయ ఇంకెంత మాత్రమూ తట్టుకోలేని భంగిమ. కోరికల వల్లేమో, పిల్ల ఒళ్ళూ మరింత పొంగింది.. ఆ బిగుతైన లంగా జాకెట్ లలో నుండి ఎక్కడి కక్కడ కన్నె అందాలు పొంగి పొంగి విజయ మనసును చిందర వందర చేసేస్తున్నాయి. అంతటి భువనైక మోహన అందాన్ని అలా అర్ధనగ్నంగా చూసి ఇక ఆగలేకపోయింది విజయ. ఇక సున్నితమైన ఫోర్ ప్లేతో కోరికలను తీర్చుకునే తీరిక విజయకు లేకపోయింది. ఈ శృంగార సామ్రాజ్యాన్ని తన నాగలితో లోపలికంటా దున్నిపారేయనిదే తన మనసుకిక శాంతిలేదు. ఆ సుఖాన్ని జుర్రేసుకోవాలనే కోరిక తన మనసునీ శరీరాన్నీ మెలి పెట్టేస్తుంటే, విజయ స్వప్నను వాటేసుకుని తమకంగా తనకేసి నొక్కుకుంటూ జాకెట్ హుక్స్ పైకి చేతులు పోనిచ్చి చకచకా విప్పి అవతల పారేసింది..

నిండైన బ్రా, లోపలి కోరికతో ఉప్పొంగుతున్న భండాగారాలను ఏమాత్రం దాచలేకపోతోంది. సగానికి పైగా బయటే ఉన్నాయి. ఉబికిన రొమ్ములు ఒకదానితో ఒకటి ఒత్తుకుని మధ్యలో ఒక సన్నటి గీత లోతుగా ఏర్పడింది. ఉప్పొంగిన స్వప్నవక్షోజాలతో బ్రా తెగిపోయేలా ఉంది. లంగా, బ్రా లోని ఆ టైటు అందాలను ఆడభల్లూకం లా నలిపేస్తూ, ఆ లోయలో తన మొహాన్ని చేర్చి రుద్దేయసాగింది. స్వప్నకు కితకితలు పెడుతున్నట్లై అప్రయత్నంగా విజయ తలను తన కేసి హత్తుకుంది. విజయ స్వప్న చుట్టూ చేతులేసి బ్రాహుక్స్ రిలీజ్ చేసేసింది. ఉబ్బిన పాలిండ్ల వల్ల బిగుతుగా సాగిఉన్న బ్రా, రబ్బరు బేండులా దానికదే స్ప్రింగులా ఊడి వచ్చేసింది. స్వేచ్చ పొందిన యవ్వన గిరులు ముందుకు ఝమ ఝమ లాడుతూ బయల్పడ్డాయి. పొగరుగా ఊగుతున్న ఆ సంపదను తనివి తీరా చూసుకుంది విజయ. బంగారుకుండల్లా ఉన్నాయి. పోయినసారి తను స్వప్నను బలాత్కరించినప్పుడి కన్నా ఇప్పుడైతే మరింత పెరిగాయి. బహుశా కోరికవల్ల కాబోలు ఉబ్బి ఉంటాయి. మొన్న ఇమిడినట్లుగా ఇప్పుడు తన చేతులలో ఇమడటం లేదు. మురిపెంగా కంటి నిండాచూసుకుంది. ఇవ్వాళ్టి నుండి వీటిపై సర్వ హక్కులూ తనవే. వీటిని కాదుకదా అసలు రేపటి నుండి స్వప్ననే కొన్ని నెలల పాటు తను బయటి ప్రపంచానికి కనపడనివ్వదు.

“ఎలా పెంచావ్ స్వప్నావీటిని ? నీకంటె పెద్దదానిని, రోజూ జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాను. అయినా నావాటి కంటే పెద్దగా... నా చేతులకు అసలు పట్టటం లేదు. ” అంటూనే వాటి మీద మొరటుగా చేతులు వేసింది విజయ. బిరుసెక్కిన ముచ్చికలు స్టిఫ్ గా తగిలాయి. విజయ వాటిని పిసుకుతుంటే స్వప్న వళ్ళంతా రోమాలు నిక్క బొడుచుకుంటున్నాయి. ఆచ్చాదన లేని ఆమె వక్షసంపదని రెండు చేతులతోనూ యధేచ్చగా దోచుకోసాగింది. స్వప్న స్థనాగ్రాలు విజయ నోట్లోకి వెళ్ళి వస్తున్నాయి ఒకదాని వెనుక ఒకటిగా. విజయ నోరూ,నాలికా, చేతులూ వంతుల వారీగా వాటిపై చేస్తున్న అల్లరికి స్వప్న మెలి తిరిగిపోసాగింది. వాటి మొనలని సుతారంగా కొరుకుతూ విజయ స్వప్నలోని స్త్రీత్వపు ఉద్రేకాన్ని రెచ్చగొట్టసాగింది. ఒక ఆడదానికి ఏమి చేస్తే కసి రేగుతుందో మరో ఆడదే బాగా అర్దం చేసుకోగలదు. అంత వరకూ ఎరగని కొత్త అనుభవం స్వప్నను వేరే లోకాల్లో కి తీసుకుపోసాగింది.

స్వప్న ఆ మైకంలో ఉండగానే విజయ స్వప్న లంగా ముడిని కాస్తా విప్పేసి క్రిందకు పడేసింది. స్వప్నను వెనక్కి నెట్టుకుంటూ మంచంపై వెల్లకిలా పడేసి తనూ కౌగిలి బిగిసడలించకుండా స్వప్న మీద పడింది. స్వప్న ఇప్పుడు పూర్తి నగ్నంగా ఉంది. విజయ మాత్రం తన టీ షర్ట్ ఇంకా విప్పుకోలేదు. నగ్నంగా స్వప్న తొడల మధ్య సందు చేసుకుని తన నిక్కరు నడుముని ఇరికించింది.

మంచంపై ఆరబోసిన విందు భోజనంలా ఉన్న ఆ నగ్నసౌందర్యం రెచ్చగొడుతుంటే విజయ తన చేతులను ఎక్కడెక్కడో వేస్తూ సుడిగాలిలా స్వప్నను ముంచేయసాగింది. ఏ భాగాన్ని ముందు అనుభవించాలో తేల్చుకోలేక ఆపలేని తాపంతో స్వప్నకూ తనకూ మధ్య గాలి కూడా ఉండడాన్ని సహించలేనట్లుగా స్వప్నను అల్లుకుపోతూ తన పెదవులను స్వప్న పెదవులపైకి తెచ్చి ముద్దులతో ముంచెత్తుతూ ఊపిరి సలపనంతగా నలిపేయసాగింది. బలమైన మేడం బాడీ తన ఒంటిలోని సలపరాన్ని పరుపుకేసి నొక్కుతూ మసాజ్ చేస్తుంటే, స్వప్న నోటిలోంచి తియ్యని మూలుగులు వస్తున్నాయి. తన లేలేత శరీరంపై, తన బరువుకు దాదాపు రెండున్నర రెట్ల బరువైన మేడంవున్న శరీరం పరుచుకుని నొక్కేస్తూ ఉంటే ఎలాంటి బాధా లేదు సరికదా ఎంతో హాయిగా ఉంది. విజయ, స్వప్న చంకల క్రిందనుండి వీపుపై చేతులు వేసి జరగబోయే రతి కార్యక్రమానికి అనువుగా తనకేసి అనువుగా స్వప్న శరీరాన్ని తిప్పుకుంటూ అదుముకుంటుంటే ,మేడంని స్వప్న లతలా అల్లుకోసాగింది.

విజయ స్వప్న పైనే ఉంటూ నడుం మధ్యలో తన భారాన్ని అలాగే ఉంచి కొద్ది క్షణాలు తన పై భాగాన్ని కాస్త పైకి లేపి తన రెండు అరిచేతులను స్వప్నకు రెండు వైపులా ప్రక్కలకు ఆన్చి వేటు వేయబోయే ముందు చేజిక్కిన మేకను చూసే శివంగిలా పూర్తి నగ్నంగా ఉన్న స్వప్నను ఆకలిగా చూసుకోసాగింది. మసాలా దట్టించి ఘుమఘుమ లాడుతూ పళ్ళెంలో ఆరగింపుకి రెడీగా పెట్టిన కండ పట్టిన అరకోడిలా ఉంది స్వప్న. పలుచటి పొట్ట పైకీ క్రిందికీ ఉద్వేగంగా కదులుతోంది. పొత్తి కడుపు క్రింద నూనూగుగా బంగారు రంగులో నూగారు. ఆ నూగారు క్రింద ఇంకా వెంట్రులు మొలవని కామ పీఠం ఉబ్బిన బర్త్ డే కేకులా నిగ నిగ లాడుతోంది. చేతితో తడిమింది. మృదువుగా, మెత్తమెత్తగా తగిలింది. తన పిడికిలిలో బిగించి పిసకసాగింది. తనివితీరక కొద్ది క్షణాలపాటు అలా పిసుకుతూ ఉండిపోయింది. స్వప్న సన్నగా మూలుగుతూ మెలి తిరిగి పోసాగింది.

అప్పటికి గానీ ఒంటిపై కాస్తయినా ధ్యాస రాని స్వప్న ఉలిక్కిపడి తన శరీరంకేసి చూసుకుని, తన ఒంటిపై నూలుపోగైనా లేని విషయాన్ని గమనించింది. లేత పసిమి ఛాయలో, లైటు వెలుతురులో వింత కాంతితో మెరుస్తున్న తన శరీరాన్ని ఆకలిగొన్న పులిలా మేడం చూస్తూ తన మానాన్ని పిసుకుతోంది. పైగా మేడం మాత్రం ఇంకా బట్టలిప్పుకోలేదు. మేడం తన బట్టలను పూర్తిగా ఊడబెరికిన విషయాన్ని కూడా గమనించని తన పరాకును తిట్టుకుంటూ ఏదైనా కప్పుకోడానికి దొరుకుతుందేమోనని అటూ ఇటూ చూసింది. బట్టలిప్పుకోని మేడం క్రింద నలుగుతూ పూర్తి నగ్నం గా తను. గాభరాగా అనిపించింది. ఇద్దరూ నగ్నంగా ఉన్నా కొంతలో కొంత నయం. కానీ ఇలాగా ? మేడం నడుము క్రింద తన ఆడతనం ఆక్రమణలో కప్పబడి ఉంది. లైట్ వెలుగులో మేడంని రారమ్మని కవ్విస్తున్న తన వెన్న బంతులని తన చిట్టి చేతులతో కప్పుకోడానికి ట్రై చేసి కుదరక తన రెండు అరచేతులతో సిగ్గుతో ఎర్రబారిన తన మొహాన్ని కప్పుకుంది.

నవ్వుతూ విజయ తన ఒంటిపై ఉన్న టీషర్ట్ ని చకచకా విప్పి అవతలకు గిరాటేసింది. ఇప్పుడు విజయ ఒంటిపై ఒక్క నిక్కరుతప్ప ఏమీ లేదు. మొహాన్ని కప్పుకున్న స్వప్న చేతులను తన చేతులతో తప్పించి ఆమె చేతి వేళ్ళలో తన చేతులను ఇరికించి రెండు ప్రక్కలా పరుపుకేసి నొక్కి పట్టుకుంది. అంత సిగ్గులోనూ స్వప్న మేడం అర్థ నగ్న శరీరాన్ని చూడకుండా ఉండలేకపోయింది. దబ్బపండు రంగులో లేడీ బాడీ బిల్డర్లా పుష్టిగా ఎక్కడా మచ్చలేకుండా నిగనిగలాడుతున్న మేడం శరీరం తనపై వాలుతుండడాన్ని చూసింది. రెండు కొండల్లా బలంగా కోరికతో బిరుసెక్కిన ఉన్న ముదురు స్థనాలు. వాటిపై మధ్యలో అర్థరూపాయి సైజులో డార్క్ గా ఉన్న చను మచ్చలు. వాటిపై అరంగుళం ఎత్తులో స్టిఫ్ గా ఉన్న మొనలు తన లేత పాలిండ్లను కుమ్మడానికి రెడీగా ఉన్నాయి. పొట్టమాత్రం లోపలికి ఉంది. వాటి క్రింద సన్నగా ఉన్ననడుము. మధ్యలో దిగుడుగా ఉన్న నాభి. స్వప్న తొడలమధ్య ఇరికించిన విజయ నడుము కదను తొక్కడానికి రెడీగా ఉన్న ఆడగుర్రం నడుం లా ఉంది.